ఏపీ అటవీ శాఖలో ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. కొత్త జిల్లాలకు అనుగుణంగా కొత్తగా అటవీ శాఖాధికారులను నియమించింది. 26 జిల్లాల్లో 32 టెరిటోరియల్ డివిజన్లు, 12 సోషల్ ఫారెస్ట్ డివిజన్లు, వైల్డ్ లైఫ్ డివిజన్లకు డీఎఫ్వోలను నియమించింది. ఇందుకోసం ప్రస్తుతం పనిచేస్తున్న డీఎఫ్వోలను బదిలీచేసింది. ఇతర అధికారులు, సిబ్బందిని కూడా నియమించింది. నేటి నుంచి కొత్త డివిజన్ల ప్రకారం అటవీశాఖ పనిచేయనుంది.