ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని సగర్వంగా చెప్పేందుకు రామ్కో సిమెంట్ పరిశ్రమ స్థాపనే ఒక ఉదాహరణ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రామ్కో ప్రాజెక్టు 2019లో మన ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల కాలంలో స్టార్ట్ అవ్వడం, 30 నెలల్లోనే సిమెంట్ ఉత్పత్తికి రెడీ అవ్వడం గొప్ప మార్పునకు చిహ్నమని సీఎం అన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాలలో నెలకొల్పిన రామ్కో కంపెనీ సిమెంట్ పరిశ్రమను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు.