మంగళగిరి 6వ బెటాలియన్ లో బుధవారం జరిగిన 20వ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి రాష్ట్ర హోం మినిస్టర్ తానేటి వనిత హాజరయ్యారు. కార్యక్రమంలో పోలీస్ జాగిలాల ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఉత్తమ ప్రదర్శన కనబరిచిన డాగ్ స్క్వాడ్ బృందాలకు హోంమంత్రి అవార్డులందించారు. హోమ్ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ పొందిన 177 పోలీస్ జాగిలాల ఆరోగ్య అవసరాల కోసం వెటర్నరీ డాక్టర్ పోస్ట్ ను మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ పూర్తి పారదర్శకంగా పనిచేస్తోందని అన్నారు. కార్యక్రమంలో హోం ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ సీతా రామాంజనేయులు, ఎమ్మెల్యే ఆర్కే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.