కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీఏ సర్కారు తీపి కబురు అందించింది. ఉద్యోగులకు 4 శాతం కరువు భత్యం(డీఏ) పెంచింది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. తాజా పెంపుతో ఉద్యోగులకు అందే డీఏ మొత్తం 38 శాతానికి చేరింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 50 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.