ముంబయిలోని చెంబూర్ ప్రాంతంలో దారుణం జరిగింది. రూపాలీని ట్యాక్సీ డ్రైవర్ ఇక్బాల్ రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి కొడుకు పుట్టాడు. కొన్నాళ్లుగా తమ మత సంప్రదాయాలు పాటించాలని రూపాలీపై భర్త ఒత్తిడి తెస్తున్నాడు. ఒప్పుకోని రూపాలి బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది. విడాకులకు కోర్టులో దరఖాస్తు చేసింది. దీంతో సోమవారం ఆమెను ఇక్బాల్ నరికి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.