వైసీపీ నాయకులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు. ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుపై ఈ భేటీలో సమీక్షించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు టార్గెట్ గా పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. గడప గడపకు కార్యక్రమంలో నేతల పనితీరుపై విశ్లేషణ జరిపారు.