విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో తొడలు కొట్టినంత మాత్రాన నేతలు కాలేరని.. మీడియా నుంచి కాదు... ప్రజల నుంచి నాయకులు బయటకు వస్తారని అన్నారు. పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసే వారికే ప్రాధాన్యం ఉంటుందనీ.. కమరియల్ నేతలను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా దేవినేని ఉమాపైనే అని పార్టీలో చర్చ సాగుతోంది.