రామాపురం మండలం నీలకంఠ రావు పేట గ్రామ పంచాయితీ నందు 98 మంది లబ్ధిదారులకు మండల జెడ్ పి టి సి మాసన వెంకటరమణ, ఎంపీడీవో హైదర్ వలీ వైయస్సార్ చేయూత చెక్కులను పంపిణీ చేశారు. వాళ్ళు మాట్లాడుతూ వెనుకబడిన మహిళల ఆర్థిక సాధికారతకు వైయస్సార్ చేయూత ఒక వరం అన్నారు. ఆ తర్వాత రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బాబు, అయూబ్ ఖాన్, జాకీర్ హుస్సేన్, ఏ పీ ఎం రెడ్డమ్మ, పంచాయతీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.