అంగన్వాడీ కార్యకర్తలకు ప్రతిరోజు రిజిస్టర్ రాసి పని ఉంటుందని వారి పనిని సులభతరం చేయడం కోసం ప్రభుత్వం ఈ సెల్ ఫోన్ లను అందించిందని మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాం రెడ్డి అన్నారు. బుధవారం మైదుకూరు పట్టణంలోని అంగన్వాడి కార్యకర్తలకు సెల్ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అంగన్వాడి పాఠశాలలో చిన్నపిల్లలను కంటికి రెప్పలా చూసుకునేవారు అంగన్వాడీ కార్యకర్తలు అని అన్నారు. వారికి పని భారం తగ్గించేందుకు ఈ సెల్ ఫోన్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాచునూరి చంద్ర, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa