పంచాయతీ అధికారులు చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలపై దృష్టి పెట్టాలని డిపిఓ నాగరాజు తెలిపారు. బుధవారం సుండుపల్లె లోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులతో సచివాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీలో తడి పొడి చెత్తను సేకరించి చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి తరలించాలని ఆదేశించారు.
వానపాముల ద్వారా ఎరువును ఉత్పత్తి చేసి కిలో పది రూపాయలు చొప్పున రైతులకు అమ్మాలని తెలిపారు. గ్రామాలలో పారిశుద్ధ సమస్యలు లేకుండా చూడాలని కోరారు. దోమల నుండి జాగ్రత్తలు పాటించేలా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డి రామచంద్రారెడ్డి, పంచాయతీ కార్యదర్శిలు పాల్గొన్నారు.