ఎన్నికల నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానం ప్రక్రియను చేపట్టాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. బుధవారం పుట్టపర్తి నియోజకవర్గంలోని ఎనుములపల్లిలో ఉన్న 102వ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానం చేయాలన్నారు. ఇప్పటివరకు ఫామ్ 6బి ఏమైనా సేకరించారా అని ఆరా తీశారు. 666 ఫామ్ 6బిలను సేకరించడం జరిగిందని, మిగతా వాటికి కూడా సేకరించాలన్నారు. త్వరితగతిన ఓటర్ కార్డ్, ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ భాస్కర్ నారాయణ, డిప్యూటీ తహసిల్దార్ నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.