విశాఖపట్నం పరిపాలన రాజధానిగా వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏంటి ఇబ్బంది అని బుధవారం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎద్దేవాచేశారు. చీపురుపల్లి వైస్సార్ పార్టీ కార్యాలయం లోవైస్సార్ పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, మండల వైస్సార్ పార్టీ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, యువజన నాయకులు బెల్లానవంశీకృష్ణ, పత్రికా సమావేశం లో మాట్లాడుతూ విజయనగరం జిల్లా తెలుగుదేశం నాయకులు ఉత్తరాంద్ర ప్రాంతం అభివృద్ధి కావాలా వద్దా, విశాఖపట్నం లో పరిపాలన రాజధాని కావాలా వద్దా సూటిగా సమాధానం చెప్పాలని, ఈ ప్రాంతం లో పరిపాలన రాజధాని వస్తే పారిశ్రామికంగా, అభివృద్ధి జరుగుతుంది అని, అలాగే పబ్లిక్ సెక్టార్, ప్రెవేట్ సెక్టార్ లో అనేక రంగాలు ఇక్కడ నెలకొలపుతారు అని అన్నారు, విశాఖపట్నం సాఫ్ట్ వేర్ రంగంలో, ఇతర రంగాలలో హైదరాబాద్ లా తయారు అవుతుంది అని, ఉత్తరాంద్ర ప్రాంతం లో వున్న నిరుద్యోగ యువతీ, యువకులు కు ఎన్నో ఉద్యోగఅవకాశాలు విశాఖపట్నం లో లభిస్తాయని అన్నారు, అన్ని విధాలుగా విశాఖపట్నం పరిపాలన రాజధాని కి అనుకూలమైన ప్రాంతం అని ఇక్కడ రాజధాని ఏర్పడితే అటువెనుక బడిన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు, పార్టీ లకు అతీతంగా అందరూ విశాఖపట్నం రాజధాని నిర్ణయం స్వాగతించాలని కోరారు, తెలుగుదేశం నాయకులు ఈ విషయం లో ఉత్తరకుమారూల్లా ప్రగల్బాలు పలకితే ప్రజలు తగిన విధంగా బుద్ది చెప్పడానికి సిద్ధంగా వున్నారు అని విశాఖపట్నం పరిపాలన రాజధాని గా వద్దు అన్న తెలుగుదేశం నాయకులు అందరూ ఉత్తరాంద్ర చరిత్ర లో చరిత్ర హీనులుగా మిగిలి పోతారు అని అన్నారు, వైస్సార్ పార్టీ విధానం మూడు రాజధానులు అని, మా ముఖ్య మంత్రి వైయెస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, పరిపాలన వికెంద్రికరణజరగాలని ఈ రాష్ట్రము లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం అయిపోకూడదు అన్నది ముఖ్య మంత్రి గారి ఆలోచన అని అన్నారు, అమరావతి రైతులు పాదయాత్ర దేనికి రాయలసీమ, ఉత్తరాంద్ర, మిగతా జిల్లాల ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రము లో శాంతి భద్రతలకు భంగం కలిగించి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టటానికి ఈ పాదయాత్ర చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు చేయిస్తున్నారు అని అన్నారు, ఇది పెట్టుబడి దారులు యాత్ర, రియల్ ఎస్టేట్ వ్యాపార యాత్ర అని అన్నారు ఈ పాదయాత్ర లో రైతులుఅసలు లేరు అని తెలుగుదేశం కార్యకర్తలు, వ్యాపారస్థులు వున్నారని అన్నారు, ఇది ఉత్తరాంద్ర ప్రాంతం మీద దండయాత్ర లా వుంది అని మా ప్రాంత అభివృద్ధి ని కాలరాయాలని చుస్తే ఈ ఉత్తరాంద్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు అని తెలుగుదేశం నాయకులు కు చంద్రబాబు కి తగిన బుద్ది చెపుతారు అని అన్నారు, ఈ కార్యక్రమం లో వైస్సార్ పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, మండల వైస్సార్ పార్టీ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, యువనాయకుడు బెల్లానవంశీకృష్ణ, AMC చైర్మన్ ధన్నానజనార్ధన, టౌన్ ప్రెసిడెంట్ పతివాడ రాజారావు, రైల్వే బోర్డు మెంబర్ తాడేలఉమా, కనకమహాలక్ష్మి చైర్మన్ ఇప్పిలి గోవింద, pacs అధ్యక్షులు పనస అప్పారావు, పేరిపి సర్పంచ్ కోరాడ పృథ్వి రాజ్, ఎంపీటీసీ లు గిరిడి రామదాసు, ముళ్ళు పైడిరాజు, కోరుకొండ దాలయ్య, కంది అప్పారావు, చింతాడ లక్ష్మణ, ప్రభాత్, కిషోర్, ప్రసాద్ పాల్గొన్నారు.