ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరువ చేయాలని నరసన్నపేట ఎంపీపీ అరంగి మురళీధర్ కోరారు. నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో నరసన్నపేట పోలాకి ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ఫోన్లను ఆయన బుధవారం అందజేశారు. ప్రధానంగా వైద్యంపై, విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అన్నారు. ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందువల్ల అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారం, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టు పరిధిలో ఉన్న 238 మంది అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ఫోన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట జడ్పిటిసి చింటూ అన్నపూర్ణ రామారావు, ఎంపీటీసీ గదిలిమల్లేశ్వరరావు, ఎంపీడీవో బొడ్డేపల్లి మధుసూదనరావు, సిడిపిఓ కె నాగమణి, అంగన్వాడి సూపర్వైజర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.