బీహార్ ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ హర్జోత్ కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినులు శానిటరీ ప్యాడ్లను ఉచితంగా అందుబాటులో ఉంచాలని కోరారు. దీనికి హర్జోత్ కౌర్ స్పందించారు. 'ఈరోజు మీరు శానిటరీ ప్యాడ్లు అడుగుతున్నారు, రేపు కండోమ్లు అడుగుతారు' అంటూ వ్యాఖ్యానించారు. ఆమెపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.