దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పేరు మీద ఏర్పాటు చేసిన ఎన్ టీ ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తక్షణమే ప్రభుత్వం కొనసాగించాలని గురువారం పాతపట్నం తహశీల్దార్ కు వినతి పత్రాన్ని పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు అందజేశారు, ఎన్ టీ ఆర్ ఒక పార్టీకో, భాషకో, ప్రాంతానికో పరిమితం కాదని, దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి అని కొనియాడారు కనుక ప్రభుత్వం తక్షణమే పేరు మార్పు పై పునరాలోచించుకోవాలన్నారు ఆయన తోపాటు 5 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎం జీ ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.