బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం పోలీసులు వాహనాల తనీఖీలు ముమ్మరంగా చేపట్టారు. ఎస్ఐ శివప్రసాద్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో తనీఖీలు నిర్వహించారు. అనంతపురం నగరంలో ని హౌసింగ్ బోర్డ్, శ్రీకంఠం సర్కిల్ వద్ద మహిళల నుండి ద్విచక్రవాహనంపై వచ్చి దొంగలు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. దీంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముమ్మరంగా వాహనాల తనిఖీ చేపట్టినట్లు వారు తెలియజేసారు.