ఏపీలో అక్టోబర్ 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలు అమలులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన వెబ్ సైట్ను సీఎం జగన్ శుక్రవారం ప్రారంభిస్తారు. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునే వధూవరులు టెన్త్ పాసై ఉండాలి. చదువును ప్రొత్సహించేందుకే ఈ నిబంధనను తప్పనిసరిని చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పెళ్లి నాటికి వధువుకు 18, వరుడికి 21 ఏళ్లు నిండాలి.