ఏపీలో అనర్హత కారణంగా రైస్ కార్డు కోల్పోయిన వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దరఖాస్తు చేసుకుంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనంతరం కొత్తకార్డు మంజూరు చేయనుంది. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ గ్రామ, వార్డు సచివాలయాల్లో స్ప్లిట్ ఆప్షన్ ను తీసుకొచ్చింది. వీరితో పాటు విడాకులు తీసుకుని సంతానం లేని ఒంటరి వ్యక్తులు కూడా తగిన ధ్రువపత్రాలు సమర్పిస్తే రైస్ కార్డు ఇవ్వనున్నారు.