కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే ఎన్నికయ్యే అవకాశం ఉంది. అధ్యక్ష పదవి రేసు నుంచి దిగ్విజయ్ సింగ్ తప్పుకున్నారు. మరికాసేపట్లో మల్లిఖార్జున ఖర్గే నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో మల్లిఖార్జున ఖర్గే, శశి థరూర్ ఉన్నారు. గెహ్లాట్ వ్యవహారంతో విధేయులపై సోనియా గాంధీ అపనమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.