ఏపీ సర్కార్ గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లాలోని మొగిలిగుండాల మినీ రిజర్వాయర్ పేరును బూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌గా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. కాగా ఈ మినీ రిజర్వాయర్‌కు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి పేరు పెడతామని సీఎం వైఎస్ జగన్ ఇటీవల హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేస్తూ ఆ రిజర్వాయర్‌కు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల రిజర్వాయర్‌గా నామకరణం చేస్తూ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ గురువారం ఉత్తర్వులిచ్చారు.