సాధారణంగా తెలుగు వారికి భోజనంలో చివరగా పెరుగు తీసుకోవడం అలవాటు. అయితే పెరుగుతో పాటు, లేదా పెరుగు తిన్న వెంటనే కొన్ని పదార్థాలను తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. పెరుగుతో పాటు చేపలు, ఉల్లి, మినపపప్పుతో వేయించిన ఆహార పదార్ధాలు, మామిడి పండ్లు తినకూడదు. ఇలా కలిపి తింటే దద్దుర్లు, సోరియాసిస్, గ్యాస్ట్రిక్, తామర, వాంతులు వంటివి తలెత్తే ప్రమాదముంది.