గుంతకల్లు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు, పాత బస్టాండు తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పనులను శుక్రవారం మున్సిపల్ కమీషనర్ బండి శేషన్న క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తెల్ల వారుజామున నుండి తేలికపాటి వర్షం కారణంగా మురికి కాలువలలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండడంతో మురు గునీరు రోడ్లపైకి రావడంతో కమీష నర్ దగ్గర ఉండి కాలువలను శుభ్రం చేయించారు. మురికి కాలువల్లో రోజు చెత్తను తొలగింపజేయాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు.