ఏపీలోని గ్రేడ్-1, 2 వీఆర్వోకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సర్వీస్‌లో ఉన్న వారు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వనుంది. వీఆర్వో సర్వీస్ నిబంధనలు-2008లో మార్పులు చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గ్రేడ్-1, 2 వీఆర్వో కుటుంబంలో డిగ్రీ చదివిన భాగస్వామి/పిల్లలకు కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్, ఈ క్యాడర్ కు సమానమైన ఉద్యోగం ఇస్తారు.