ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు ఈబీసీ, కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. ప్రభుత్వం గుర్తించిన 200 యూనివర్సిటీల్లో సీటు సాధించిన వారు అర్హులు. కులం, ఆదాయ సర్టిఫికెట్లు, మార్కులిస్టు తదితర వివరాలతో ఈ నెల 30వ లోపు https://jnanabhumi.ap.gov.in వెబ్సైట్లో అప్లై చేయాలి.