ఎమ్మిగనూరు: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కెఆర్. మురహర రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం పట్ట ణంలోని సోగనూరురోడ్డు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర బీజేపీ ప్రజాపోరు యాత్ర 10వ రోజు సందర్భంగా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియచెప్పాలన్నారు. సోగనూరు రోడ్డు ప్రాంతంలో ప్రజలు తాగునీటి సమస్యను ఎదురుకొంటున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు. సమావేశంలో బీజేపీ టౌన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ భారతమ్మ, నాయకులు ఖాసీం, రామాంజీ తదితరులు పాల్గొన్నారు