కర్నూలు, కోడుమూరు: మండలం వర్కూరు గ్రామ సమీపంలో ఉన్న తుమ్మలవాగు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుంది. శుక్రవారం కర్నూలు- ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 4 గంటలకు పైగా వాహనాలు నిలిచి రాకపోకలకు తీవ్రఅంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు పడిన ప్రతిసారి తుమ్మలవాగు వద్ద ఉన్న వంతెనపై భారీగా నీరు వస్తుండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడ వంతెన నిర్మాణం చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa