తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా తో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం కలిగితే సంతోషించే రీతిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా పనిచేస్తుంది అనేది వారి పత్రికలు చూస్తేనే తెలుస్తుందన్నారు. ఉచిత విద్యుత్‌పై మాట్లాడే నైతిక హక్కు ఎవ్వరికీ లేదన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం రివ్యూలో సీఎం ఆయన్ను కూడా కలుపుకొని ఎమ్మెల్యేలు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పీకే టీమ్‌ను ఎందుకు పెట్టుకున్నామంటే.. టెక్నాలజీ పెరిగింది, సోషల్ మీడియా ప్రభావం పెరిగింది. పబ్లిక్‌ను రీచ్ కావడానికి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని వారితో టచ్‌లో ఉండటం అవసరం. ప్రజల సంక్షేమం కోసం అవసరమైన పనులు చేశాం. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయనేది సీఎం రివ్యూ చేసుకున్నారు. సీఎం స్పీచ్‌లో పూర్తిగా పాజిటివ్‌గా సాగింది. మనం 175 టార్గెట్ పెట్టుకున్నప్పుడు కాన్ఫిడెన్స్‌తో పాటు డిసిప్లేన్ అవసరం అని చెప్పారు. ఒక కుటుంబంలో అందరం కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో.. అలాగే సీఎం వైయస్ జగన్ కూడా ఒక నాయకుడిగా అందరినీ అలర్ట్ చేశారు అని తెలియజేసారు.