దసరా నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం మైదుకూరు పట్టణంలో కేఎస్ఆర్ హరిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి కేసర్ ఫౌండేషన్ చైర్మన్ కదిరి సంజీవ రాయుడు యాదవ్ మాట్లాడుతూ. దసరా నవరాత్రుల సందర్భంగా మైదుకూరులోని పూరి గుడిసెల్లో ఉన్న నిరుపేద వారికి కువైట్ ఎన్నారై మన తెలుగు సేవా సమితి నవీన్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, జీ నరసింహులు అన్నగారి సహకారం వలనే కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. విరి ఇరువురిని అమ్మవారు దీవించాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. అజర్ అలీ చేతులమీదుగా 150 మందికి భోజనాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేస్తం ఫౌండేషన్ కోగోటం కొండారెడ్డి, సభ్యులు సునీల్, యునోస్, హరీష్, అబ్దుల్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.