కేసీఆర్ను, హరీష్ రావును, టీఆర్ఎస్ను చూసి నేర్చుకోవాల్సిన దుస్థితి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. హరీష్ రావు కేసీఆర్ మనిషా.? లేక రామోజీరావు మనిషా.? అని ప్రశ్నించారు. హరీష్ రావుకు ఆయన మేనమామతో ఏమైనా గొడవులు ఉంటే.. నేరుగా ఆయన్ను తిట్టాలని ఉంటే ఆయనే తిట్టవచ్చు కదా.. మమ్మల్ని ఏదైనా అంటే, మేము వాళ్ల మామ, అక్కడ ముఖ్యమంత్రిని తిడితే ఆయన ఆనందపడలానా..?. కేసీఆర్ ను మా చేత తిట్టించాలనే విధంగా హరీష్ రావు తీరు కనిపిస్తోందన్నారు. కేసీఆర్కు, హరీష్ రావుకు మధ్య ఏమైనా గొడవలు ఉంటే వాళ్లూవాళ్లూ చూసుకోవాలి.. అంతేకానీ మా రాష్ట్రం మీద ఎందుకు పడతారు?. మమ్మల్ని తిడితే మీకు అక్కడ ఏమైనా మార్కులు పడతాయా? అని ప్రశ్నించారు. విశాఖలో మంత్రి అమర్నాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్రావు వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు.