కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విద్యుత్ సంస్కరణలలో భాగంగా, రైతుల మోటర్లకు మీటర్లు బిగించాలన్నా నిరంకుశ నిబంధనలకు దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు పూర్తిగా వ్యతిరేకిస్తే! మన రాష్ట్రంలోని వైఎస్ ప్రభుత్వం అంగీకారం తెలిపి వెయ్యి కోట్ల రుణం కోసం కక్కుర్తి పడి, రైతు మెడలకు మీటర్ల రూపంలో ఉరితాడు బిగించాలని చూస్తుందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం ఆర్సిపి రాష్ట్ర కార్యాలయంలో రాయలసీమ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి లింగమూర్తి తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అండ తోటి రైతులకు వ్యవసాయ మోటర్లకు మీమీటర్లు బిగించే పనిని మేము ఉదృతం చేస్తామని, పెద్దిరెడ్డి అహంకారంతోనూ కండకావరంతోను మాట్లాడటాన్ని వ్యతిరేకిస్తూ రైతులేమీ వైసిపి బానిసలు కాదన్న విషయాన్ని పెద్దిరెడ్డి గుర్తించాలని ఆయన హెచ్చరించారు.
వైసీపీ పాలనలో పెద్ధిరెడ్డి హావ జరుగుతున్న నేపథ్యంలో అదే తరహాలో, రైతులపై అహంకారపూరిత మాటలు, వ్యాఖ్యలు చేయడం రైతులేమి నీ ఇంటి జీతగాళ్లు, బానిసలని అనుకుంటున్నావా! ఓట్లు వేసి నీకు అందలం ఎక్కించి, నీకు జీతభత్యాలను ఇస్తున్న యజమానులన్న విషయాన్ని గుర్తెరిగి నాడు, నేను మీ సేవకుడిని అన్న మాటను గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.
జగన్ అండదండలతో, ఇలాంటి అహంకారపూరిత, నిరంకుశ, కండకావరం కలిగిన వారుకి రైతులసత్తా ఏమిటో చూపించాల్సి వస్తుందని, రైతులతో పెట్టుకున్న వారు ఎవరైనా మాట్టి కరిసిపోతారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో మొత్తం 20 లక్షల పంపుసెట్లు ఉంటే! అందులో రాయలసీమలోనే 15, 16 లక్షల పంపుసెట్లు ఉన్నాయని, రైతుల వ్యవసాయాన్ని ధ్వంసం చేయాలన్న ఉద్దేశంతోనే జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించినట్టు ఉందని ఆయన తెలిపారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇసుక దోపిడీ, గ్రానైట్ దోపిడీ, గ్రావెల్ దోపిడీ చేసినట్టు, రైతుల మోటర్లకు మీటర్లు బిగించి వారిని దోపిడీ చేయాలని చూస్తే, దీనిని ఎంత మాత్రం రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ సహిస్తూ ఊరుకోదని, రైతుల మోటర్లకు మీటర్లు బిగించాలన్న ఆలోచనను, రాష్ట్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేని పక్షాన తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.