వైయస్‌ఆర్ ఆరోగ్య శ్రీ జాబితాలోకి కొత్త చికిత్సలు చేరిక దాదాపు ఖరారు అయ్యింది. కొన్ని సంప్రదింపులు మిగిలి ఉన్న దృష్ట్యా.. కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కొంత సమయం కావాలని అధికారులు కోరారు. దీంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఫలితంగా అక్టోబరు 5వ తేదీ బదులు.. అక్టోబరు 15న ఆరోగ్య శ్రీ జాబితాలోకి మరిన్ని ప్రొసీజర్ల చేరిక కార్యక్రమం ఉండనుంది. ప్రస్తుతం వైయస్‌ఆర్ ఆరోగ్యశ్రీలో 2,446 చికిత్సలు ఉన్నాయి. కొత్త వాటి చేరికతో ఆ సంఖ్య 3,254 చేరనుంది. అంతేకాకుండా.. ఫ్యామిలీ డాక్టర్ పైలెట్ ప్రాజెక్టు కూడా ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇవాళ క్యాంప్ కార్యాలయంలో జరిగిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ కీలక ఆదేశాలు ఇవ్వడంతో పాటు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.