మనదేశంలోని ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకత కలిగిన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం ఒకటి. ఇది ఎంతో పురాతనమైనది. ఈ ఆలయానికి 135 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రస్తుతం దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఈ ప్రాచీన ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఇది ఆలయం వెలుపలి సంగతి మాత్రమే.గర్భగుడిలోకి వెళ్లి చూస్తే మతిపోతుంది. అమ్మవారి విగ్రహం బంగారంతో ధగధగ మెరిసిపోతూ దర్శనమిస్తుంది. అంతేకాదు, గర్భగుడి గోడల నిండా కరెన్సీ కట్టలే కనిపిస్తాయి. ఈ విధమైన అలంకరణకు రూ.8 కోట్లు వినియోగించారు. ఆలయ కమిటీ దీనిపై స్పందిస్తూ, అమ్మవారి అలంకరణ కోసం ఈ డబ్బు, నగలు భక్తులే స్వచ్ఛందంగా ఇచ్చారని, నవరాత్రులు పూర్తయ్యాక ఎవరి డబ్బు, నగలు వారికి ఇచ్చేస్తామని వెల్లడించింది.