560 అంగన్వాడీ సూపర్వైజర్ (గ్రేడ్-2) (పదోన్నతి పరీక్ష) పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేశామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ తెలిపారు. నోటిఫికేషన్ రద్దుకు సీఎం జగన్ కూడా అంగీకరించారన్నారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించాకే నోటిఫికేషన్ రద్దు చేశామని చెప్పారు. కొత్త నోటిఫికేషన్‌పై న్యాయ నిపుణులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకే ప్రస్తుతం ఫలితాల విడుదలను నిలిపివేశామన్నారు.