అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రకృతి అందాలకు నెలవు. వంజంగి కొండపై మంచు తెరల అందాలు ఎవరి మనసునైనా ఇట్టే దోచేస్తాయి. టూరిస్టులను రా రమ్మని పిలుస్తోంది. దట్టమైన పొగమంచు పర్యాటకులను ఆకర్షిస్తోంది. కనువిందు చేస్తున్న మంచు తెరల అందాలను చూసి మదిలో కొత్త అనుభూతిని పొందేందుకు ఇప్పుడిప్పుడే పర్యాటకుల రాక ప్రారంభమైంది. అయితే శనివారం ఉదయం వంజంగి కొండకు పర్యాటకులు చేరుకొని ఆ అందాలను ఆస్వాదించి ఫిదా అయ్యారు.