డివిజన్ కేంద్రమైన నర్సీపట్నంలో పలు దేవాలయాల్లో సరనవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నర్సీపట్నం కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు లలిత త్రిపుర సుందరి అవతారంలో దర్శనం ఇచ్చారు. అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో పెదబొడ్డేపల్లిలో జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారికి లలిత సహస్రనామం జపిస్తూ పూజలు నిర్వహించారు.