ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్సులో రూ.66 వేలు, బ్యాంకు ఖాతాలో లక్షలు

national |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 07:23 PM

సమాజంలో మనం చూసే ప్రతి మనిషి వెనుక ఒక తెలియని కథ ఉంటుంది. ఒక్కోసారి ఆ కథలు ఊహకందని మలుపులతో మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. అచ్చంగా ఇలాంటి ఓ కథే బయటపడింది తాజాగా. హర్యానాలోని అంబాలా నగరంలో చిరిగిన దుస్తులు, పాత మూడు చక్రాల సైకిల్‌తో నిత్యం భిక్షాటన చేస్తూ కనిపించే ఒక వృద్ధుడి దగ్గర లక్షలాది రూపాయల సంపద బయటపడటంతో అధికారులు సైతం విస్తుపోతున్నారు.


అసలెవరీ లేఖరాజ్?


అంబాలా రైల్వే స్టేషన్ రోడ్డులోని హనుమాన్ ఆలయం వద్ద గత పదేళ్లుగా లేఖరాజ్ అనే భిక్షాటన చేస్తున్నాడు. అక్కడున్న వారందరికీ దాదాపుగా లేఖరాజ్ తెలుసు. అయితే ఎప్పుడూ నీరసించిన ముఖం, మాసిన బట్టలతో కనిపించే అతడు తన మూడు చక్రాల సైకిల్‌పైనే తిరిగేవాడు. భక్తులు, ప్రయాణికులు ఇచ్చే చిల్లరతోనే జీవనం సాగించేవాడు. అయితే ఆయన సైకిల్ వెనుక ఎప్పుడూ ఒక చిన్న పాత ఇనుప ట్రంకు పెట్టె కట్టేసి ఉండేది. అందులో ఏముందో ఎవరికీ తెలియదు. కానీ ఆ పెట్టే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.


అయితే గత కొంతకాలంగా లేఖరాజ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం గుర్తించిన 'వందేమాతరం దళ్' అనే సామాజిక సంస్థ ప్రతినిధులు ఫిబ్రవరి 9వ తేదీన లేఖరాజ్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత ఆయన తుదిశ్వాస విడిచారు. వృద్ధుడికి ఎవరూ లేకపోవడంతో ఆ సంస్థ సభ్యులే మానవత్వంతో అంత్యక్రియలు నిర్వహించారు.


పెట్టె విప్పితే నోట్ల కట్టలు..!


మరణానంతరం పోలీసులు ఆయన సామాన్లను తనిఖీ చేయగా.. లేఖరాజ్ తన జీవిత కాలమంతా కూడబెట్టిన సొమ్ము బయటపడింది. ఆయన ఎంతో భద్రంగా దాచుకున్న ఇనుప పెట్టెను తెరిచి చూడగా.. అందులో రూ. 50,000 విలువైన రూ. 500 నోట్ల కట్ట ఒకటి లభించింది. అలాగే దానిపై బ్యాంక్ ఆఫ్ ఇండియా సీలు కూడా ఉంది. ఇవే కాకుండా మరో రూ. 16,120 విడి నోట్ల రూపంలో ఉన్నాయి. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అదే పెట్టెలో ఓ బ్యాంకు పాస్‌బుక్‌ను దొరికింది. దాన్ని పరిశీలించి చూడగా.. ఆయన ఖాతాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 3,32,000 నగదు జమ అయి ఉన్నట్లు తేలింది.ఇదీ చూడండి: బిచ్చగాడి ఆస్తి చూసి 


ఒక సామాన్య యాచకుడిగా కనిపించే లేఖరాజ్ వద్ద దాదాపు రూ. 4 లక్షల వరకు ఆస్తి ఉండగా.. అధికారులు అంతా ఆశ్చర్యపోయారు. భిక్షాటన ద్వారా వచ్చిన ప్రతి పైసాను ఆయన వృథా చేయకుండా ఇలా కూడబెట్టి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ డబ్బును ఏం చేయబోతున్నారని మాత్రం ఇంకా చెప్పలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa