రాజాం మున్సిపాలిటీ పరిధిలో రాజాం. పాలకొండ జంక్షన్ మెయిన్ రోడ్డు కు అతి సమీపంలో శెట్టి వారి వీధిలో కాలువలలో నీరు రోడ్డు పై ప్రవహిస్తూ తీవ్ర దుర్గంధం వెదజల్లుతుంది. కాలువలలో మురుగు సరిగ్గా తీయక, మురుగునీరు నిండిపోయి వెళ్లే త్రోవ లేక జనాలు నడిచే రోడ్డు మీదే ప్రవహిస్తూ ఈ కాలనీవాసులు కంపును భరించాల్సి వస్తుంది. ఈ వీధి లో సుమారు 30 కుటుంబాలు వారు నివాసం ఉంటున్నారు. వర్షం పడితే సరే, మామూలు రోజుల్లో రోడ్డు మీద నీరు నిల్వ ఉండిపోతుంది. కాలువలో నీరు వెళ్లక రోడ్డు మీద వర్షపు నీరు కలిపి దుర్గంధంతో ప్రవహిస్తుండటంతో కాలనీవాసులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ వీధుల్లో వెళితే ఎవరైనా ముక్కు మూసుకొని వెళ్ళవలసి వస్తుంది. దీంతో అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని వీధివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై రాజాం మున్సిపల్ కమిషనర్ స్పందించి వ్యాధులు ప్రబలకుండా కాలువ నీరు రోడ్డుమీద నిలబడకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.