ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఉద్యోగాల భర్తీకి...గ్రీన్ సిగ్నల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 01, 2022, 08:25 PM

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త వినిపించింది.నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ - 1 కేడర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 92 గ్రూప్ - 1 ఉద్యోగాల భర్తీకి నిన్న రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతోపాటు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ - 1 పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూలను కూడా నిర్వహించనున్నారు. గతంలో ఇంటర్వ్యూలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఇంటర్వ్యూలను మళ్లీ పునరుద్ధరించింది. 


గ్రూప్ - 1 ఉద్యోగాలకు ఈ నెల 13 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 18న... మెయిన్స్ 2023 మార్చి 15న జరగనున్నాయి. పూర్తి వివరాలకు https://psc.ap.gov.in/ వెబ్ సైట్ సంప్రదించాలి. 17 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలయింది. ఈ పోస్టులకు నవంబర్ 2 నుంచి నవంబర్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://psc.ap.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa