విజయనగరం జిల్లా ఒడిశా దాబాకు సమీపా న జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 50 మంది ప్రయాణికులు సురక్షితం గా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా... విశాఖ నుంచి సాలూ రు వెళ్తున్న త్రీస్టాఫ్ ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పిం చే క్రమంలో ఆగి ఉన్న లారీనీ ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జును జ్జయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు దిగేందుకు కూడా అవకాశం లేకపోవడం తో... డ్రైవర్ సీట్ వైపు డోర్ నుంచి క్షేమంగా దిగారు.