మహిళల సంక్షేమమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం అని రాష్ట్ర మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. శనివారం రాత్రి జీవియంసి 98 వ వార్డు లో ఏర్పాటు చేసిన నవరాత్నాలు లో భాగంగా ప్రవేశపెట్టిన జగనన్న చేయూత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కంటే ఇప్పటి ప్రభుత్వం మహిళల సాధికారిక ప్రభుత్వం అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి ఈరోజు ఇదే 98 వ వార్డు లో ప్రతీ పేదవాడికి జగనన్న సంక్షేమ పథకాలు అమలు జరుగుతుందని ఈ జగనన్న చేయూత ద్వారా పలువురు మహిళలు చిరు వ్యాపారం ప్రారంభించారని అలాగే ఈ వార్డు లో ఉన్న సింహాచలం భూ సమస్య తో పాటు బీఆర్‌టీఎస్ రోడ్డు సమస్య కూడా అప్పన్న స్వామి వారి ఆసిస్సులతో నేను ఉండగానే పరిష్కారం అవుతుం దని ఈ సమస్య పరిష్కారం కావాలని ప్రతీ వారం స్వామి వారిని దర్శించుకుంటున్నానని మాట్లాడారు. అనంతరం మహిళలు అంతా కలిసి జగనన్న చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అవంతి శ్రీనివాసరావు చేతులు మీదుగా 1, 42, 68, 750 రూ 761 మంది లబ్దిదారులకు అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు కార్పోరేటర్ లు వార్డు ఇంచార్జ్ లు వార్డు ప్రెసిడెంట్ లు ఆయా పదవుల్లో ఉన్న వారు ప్రభుత్వ అధికారులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు