ఎటువంటి నోటీసు ఇవ్వకుండా హైదరాబాదులో తన తనయుడు కోడలు నివసిస్తున్న ఇంటిలోకి దౌర్జన్యంగా వెళ్లి ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించిన సిఐడి అధికారులపై టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు డ్రైవర్, లాయర్ పై కూడా వారు దౌర్జన్యం చేశారని ఆయన ఆరోపించారు. ఇంటిలో చిన్న పిల్లలకు ఫొటోలు తీసి వారిని కూడా ఇంటరాగేషన్ చేశారని అన్నారు. ప్రశ్నించిన డ్రైవర్ పై కూడా దౌర్జన్యం చేశారని అన్నారు. ప్రభుత్వం అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తున్నందుకు ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. మీ ప్రతాపం పిల్లలపై కాదని తనపై చూపించాలన్నారు.