నగరానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ , స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కు విశాఖ విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. ఈ సందర్భంగా విశాఖ ఈ మహా విశాఖ నగరపాలక సంస్ధ డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నగరంలో పలు సమస్యల పై అలాగే 52 వ వార్డుకు సంభందించిన ప్రధాన సమస్యగా ఉన్న పాస్ పోర్ట్ ఆఫీస్ నుంచి నేతాజీనగర్ మీదుగా శాంతీనగర్ చర్చిను అనుసంధానం చేస్తు ఉన్న రోడ్డుకు 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు సంభందించిన విషయమై మంత్రితో చర్చించినట్లు శ్రీధర్ తెలిపారు.