కావాల్సిన పదార్థాలు:
అరటికాయ: ఒకటి, క్యారెట్ తురుము: ఒక కప్పు, బియ్యపు పిండి: ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు: ఒక కప్పు. వెల్లుల్లి రెబ్బలు: ఐదు, పచ్చిమిర్చి: ఆరు, జీలకర్ర : ఒక టీ స్పూన్, నూనె: వేయించడానికి సరిపడా, కొత్తిమీర తరుగు: ఒక కప్పు, ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా అరటికాయను తొక్కతో సహా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు వేసి పేస్టులా చేసుకోవాలి. తర్వాత ఓ గిన్నెలో ఉడికించిన అరటికాయను తొక్క తీసి ముక్కలుగా కోసుకుని మెత్తగా చేసుకోవాలి. దీనిలో క్యారెట్ తురుము, తగినంత బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్టుతోపాటు తగినంత ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి గారెల పిండిలా కలుపుకోవాలి. అనంతరం, ముందుగా సిద్ధం చేసుకున్న పిండి మిశ్రమాన్ని వడల్లా వొత్తి నూనెలో వేయించి తీయాలి. రుచికరమైన అరటికాయ క్యారెట్ వడ సిద్ధం.