కృష్ణా, మైలవరం: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పేరు మార్చినందుకు నిరసన గా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరసన దీక్షల లో భాగంగా స్థానిక కోదండ రామాలయం వీధి లో ఏర్పాటు చేసిన నిరసన శిబిరం లో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. తొలుతగా మహాత్మ గాంధీ జయంతి సందర్బంగా నూజివీడు రోడ్డు లో ఉన్న అయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆర్య వైశ్య ప్రముఖల తొ కలిసి దేవినేని నివాళులు అర్పించారు. నిరసన సభలో అయన ప్రసంగిస్తూ తెలుగు ప్రజల గుండెల్లో కొలువై ఉన్న అన్న ఎన్టీఆర్ ని అవమానించే రీతిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గు చేటని విమర్శించారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ నిరసన కార్యక్రమం లో పాల్గొననున్నట్లు దేవినేని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమం లో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.