ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 04, 2022, 11:24 AM

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని పలు గ్రామాలలో భూమిలేని నిరుపేదలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం భూ పంపిణీ లో భూమి లేని నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొననున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa