అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆదేశాల మేరకు ఈరోజు పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. నంబర్ ప్లేట్స్ లేకుండా వెళ్తున్న వాహనాలను ఆపి చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా... ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా ప్రజలు తమ వాహనాలకు నంబర్ ప్లేట్స్ ఉండాలని, వాహనం నెంబర్ స్పష్టంగా కనిపించే విధంగా నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తున్నారు.