మనిషి తన మనసులోని చెడును తొలగించుకోవడానికి సృష్టిలో వున్న ఏకైక మార్గం ప్రస్థాన సాధన మాత్రమే అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి దివ్య ఆశీస్సులతో హైదరాబాద్‌లోని వాసవీ కళ్యాణ మండపంలో అక్టోబర్ 5న దసరా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బ్రెయిన్ క్వాలిటీ లో మార్పు చేయగలిగితే తద్వారా ఏర్పడే మనసు కూడా క్వాలిటీ గానే ఉంటుంది, మరి బ్రెయిన్ లో మార్పు సాధ్యమా?..... సాధ్యమే! దానికి ధ్యానం కావాలి. అయితే మామలు ధ్యానంతో కాదు….. దానికే ప్రస్థాన ధ్యానం! ఈ ప్రస్థానధ్యాన సాధన ద్వారా బ్రెయిన్ న్యూరాన్స్ లో మార్పు తెచ్చి, తద్వారా బ్రెయిన్ ఫంక్షన్‌ను మార్చవచ్చు.. ఈ విషయాన్ని వక్తలు విశదీకరించారు.
దూరదర్శన్ పూర్వ డైరక్టర్ శ్రీ ఓలేటి పార్వతీశం గారు గురువుగారి సందేశాన్ని చదివి వినిపించారు. మంచి, చెడు ద్వంద్వం గురించి, మనిషి జీవితంలో దాని ప్రాధాన్యత గురించి విశ్వస్ఫూర్తి వారు వివరించారు. విశ్వ శక్తినే స్త్రీ శక్తిగా భావించటం జరుగుతోందని నరకాసురుని జన్మకు, సంహారానికి, ఈ శక్తే మూలమని పేర్కొన్నారు. మహిషాసుర మర్థినిగా స్త్రీ శక్తి బలమేమిటో మనం చూడవచ్చన్నారు. దసరా, దీపావళి, తత్సంబంధ పురాణాలు, వేడుకలు, దుష్టతపై, శిష్టత గెలుపునకు సంకేతమన్నారు. జీవితంలో మంచి చెడు, శిస్టం, దుష్టం మధ్య నిత్య పోరాటంలో తుది విజయం మంచికేనన్నారు. అందుకు శరీర ఆరోగ్యంతో పాటు బుద్ది కుశలత, ఆత్మ విశ్వాసం, ఆత్మ శక్తి అవసరమన్నారు.
ప్రముఖ రచయిత్రి ముక్తేవి భారతి గారు మాట్లాడుతూ గురువుగారు తమ పుస్తకాల్లో స్త్రీ కి ఇచ్చిన విలువ గురించి ప్రసంగించారు. డిఆర్ డిఏ శాస్త్రవేత్త శ్రీనివాసరావుగారు గురువుగారి పుస్తకాల్లో ఉన్న శాస్త్ర విజ్ఞానం గురించి, మనిషి జీవితంలో ఆ విషయాలకున్న ప్రాధాన్యతను గురించి వివరించారు.
సాహితీవేత్త డాక్టర్ ముక్తేవి భారతి మాట్లాడుతూ.. ‘‘గురువుగారు పుస్తకాలు చదివేది ఎంత మంది.. ఎంత మందికి అర్ధమవుతాయని అన్నారు.. చేరినా కూడా చదివి వెంటనే అర్ధం చేసుకోకపోవచ్చు.. గురువుగారి ఉపదేశాలు శిష్యుల ద్వారా ప్రచారమవుతాయి.. గురువు ఎప్పుడూ విద్యార్థి నుంచి ఆశించవద్దు.. అనుగ్రహం చూపించాలని విశ్వగురువు చెబుతారు.. జ్ఞానాన్ని విద్యార్థులకు పంచాలి.. మనకు కావాల్సినవి సమకూర్చుకోవడం ఆశ కాదని.. అవసరమని, ఆశతోనే జీవించాలని, దురాశ పనికిరాదని గురువుగారు చెబుతారు.. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. మానవజాతి ఉమ్మడి భావం మానవత్వం.. అందరం ఒకటే అనే భావన ఉన్నప్పుడే అది సాధ్యం.. మానవత్వం లేకపోవడంతో విపరీతమైన స్వార్థం పెరిగిపోతుంది..
జాలి, దయ, త్యాగం ఇవన్నీ మానవీయ ధర్మాలు.. పదవులు, హోదాలు అనుకుంటే సాధ్యం కాదని గురువుగారు చిన్న చిన్న వ్యాసాలు రాశారు.. బృహదారణ్యకోపనిషత్తు గురించి చెబుతూ.. దేవతులు, రాక్షసులు, మానవులు వచ్చి ఏదైనా ఉపదేశం చేయమని కశ్యపపు ప్రజాపతిని అడిగారు.. కూర్చోబెట్టి ఉపదేశం చేయకుండా.. దేవతల్ని చూసి ‘ద’ అనే అక్షరం ఇచ్చి ఇదే నా ఉపదేశం అన్నారు.. దేవతలు ఇంటికెళ్లి ‘ద’ అనే అక్షరంలో ఏముందని ఆలోచించిగా ఇంద్రియ నిగ్రహం లేదని తెలుసుకున్నారు.. మానవులకు కూడా‘ద’ అనే అక్షరం చెప్పి మీకు దాన గుణం లేదని దాని ద్వారా చెప్పారు. అలాగే, రాక్షసులకు కూడా ‘ద’ అనే అక్షరం ద్వారా దయ లేదని వివరించారు..’’ అని అన్నారు.
డీఆర్డీవో శాస్త్రవేత్త శ్రీనివాస్ మాట్లాడుతూ.. గురువుగారు పుస్తకాల్లో ఇప్పటి వరకూ నేను చదవినవి ‘ది ఎక్స్‌ప్రెషన్స్, ఆ ఇద్దరు’.. మూడోది ప్రారంభించాను.. చాలా కష్టంగా ఉన్నాయి.. ఈ పుస్తకంలో జ్ఞానం ఈ సమాజానికి అవసరమని నకనిపించింది.. కారణం ఏటంటే సమాజంలో స్పష్టత కరువయ్యింది.. మనకేం కావాలో అదే వింటాం.. ఎదుటి వాళ్లు చెప్పేది వినం.. మన బాధ్యత ఎంత వరకూ, టీమ్‌లో ఎలా పనిచేయాలి అనే ప్రశ్నలకు ఈ పుస్తకాల్లో సమాధానం దొరుకుతుందనే నమ్మకం కలిగింది.. సింపుల్ వే ఆఫ్ ఎక్సప్లొనేషన్ మన గురువుగారి పుస్తకాల్లో ఉన్నాయని నాకు అనిపించంది’’ అని ఆయన అన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, మహా ప్రసాదంతో కార్యక్రమాలు ముగిశాయి. అంతకు ముందు దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో ‘ప్రస్థాన సాధన’ కార్యక్రమం ఆన్‌లైన్ పద్ధతిలో 9 రోజుల పాటు జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa