ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలంటూ మొక్కుకున్నానని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయంపై కొడాలి నాని బుధవారం మరోమారు స్పందించారు. దసరా పర్వదినాన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని కొండాలమ్మ అమ్మ వారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ
రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల కోసమే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నామని నాని తెలిపారు. అమరావతి ఉద్యమాన్ని ప్రజలతో పాటు దేవుళ్లు కూడా హర్షించరని ఆయన వ్యాఖ్యానించారు. కులాలు, పార్టీల కోసమో కాకుండా... రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేయరాదన్న భావనతోనే సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్ర సంపద అంతా ఒకే చోట పెడితే ప్రాంతీయ విద్వేషాలు వస్తాయని ఆయన అన్నారు. హైదరాబాద్‌ను కోల్పోయి అనాథలమయ్యామన్న నాని... శ్రమ అంతా అమరావతిపైనే పెడితే మళ్లీ అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa