ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మండలిలో చంద్రబాబు మాట్లాడగలరా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 28, 2026, 12:35 PM

తిరుమల తిరుపతి దేవస్థానం అనేది దేశ ప్రతిష్ట. కలలో కూడా ఎవరూ వినకూడని మాటలతో తిరుమల పవిత్రతను, స్వామి వారి ప్రతిష్టను చంద్రబాబు దిగజార్చాడు అని ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. అయన మాట్లాడుతూ.. కల్తీ నెయ్యి పేరుతో వైయ‌స్ఆర్‌సీపీ మీద నెపం నెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన చంద్రబాబు, సీబీఐ సిట్‌ చార్జిషీట్‌తో అడ్డంగా దొరికిపోయాడు. టీటీడీ తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు తిరిగి ఎలా ప్రవేశించాయి, వాటిని లడ్డూ తయారీలో ఎలా వాడారో సమాధానం చెప్పుకోవాల్సింది చంద్రబాబే. వారి హయాంలో జరిగిన తప్పులకు బాధ్యత తీసుకోకుండా వైయ‌స్ఆర్‌సీపీ మీద నిందలు మోపడం సిగ్గుచేటు. ప్రభుత్వం చేసిన తప్పులపై నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేక చర్చకు అడ్డుపడుతున్నారు. నిజాలు బయటకొస్తే ప్రజలు చెప్పులతో కొడతారనే భయం పట్టుకుంది. శాసనసభను టీడీపీ కార్యాలయంగా మార్చేశారు. శాసనసభలో మాట్లాడిన చంద్రబాబు, మండలికి రావడానికి భయపడిపోతున్నాడు అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa