థాయ్‌లాండ్ లోని ప్రీ-స్కూల్ చైల్డ్ డేకేర్ సెంటర్ లో ఓ మాజీ పోలీసు అధికారి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 28 మంది మరణించారని పోలీసులు తెలిపారు. థాయిలాండ్ లోని ఈశాన్య ప్రాంతంలోని నోంగ్ బువా లాంఫులో ఈ ఘటన జరిగింది. నిందితుడు పరారీలో ఉన్నాడని, మృతుల్లో పిల్లలు, పెద్దలు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. దాడి చేసిన వ్యక్తి పిల్లలను, పెద్దలను కాల్చి చంపాడని చెప్పారు. దాడికి గల కారణం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa